Monday, April 29, 2024

తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్

శరవన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ కు మంచి స్పందన రాగా… ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు జరగనున్న తిమ్మరుసు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాని ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. ఈమేర దర్శక నిర్మాతలు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ఓపెన్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement