Saturday, April 27, 2024

ఇదేమిటో ఈ తరంవారు ఎవరైనా చెప్పగలరా?: ఆనంద్ మహీంద్రా

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా నూతన ఆవిష్కరణలు మెచ్చుకుంటూ సరదాగా, ప్రోత్సాహకరకంగా ఉండే ట్విట్టర్‌లో పోస్టులు పెడుతుంటారు. ఈసారి ఆయన ఓ మెదడుకు మేత లాంటి పోస్టు పెట్టారు. ఓ గుండ్రిని బంతి.. దానికి ఒకవైరు నాలుగు సన్నని రాడ్లవంటివి తగిలించి ఉన్నాయి. ఇదేమిటో ఈ తరంవారు ఎవరైనా చెప్పగలరా? అని ఓ ప్రశ్నను సంధించారు. ఇంకేముంది ఎవరికి తోచింది వారు పెట్టారు. కానీ కొందరు కరెక్టుగా గెస్ చేశారు. అది రష్యా ఉపయోగించిన మొట్టమొదటి స్పుత్నిక్ ఉపగ్రహం. అంతరిక్షంపై మానవ విజయానికి సంకేతం. స్పుత్నిక్-1 అని దానికి పేరు. ఆ ప్రయోగం విజయవంతమై స్పుత్నిక్-1 భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ సంకేతాలు పంపడం విశేషం. ఆ తర్వాత చాన్నాళ్లకు అమెరికా ఉపగ్ర ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు తాజాగా రష్యా కరోనా వ్యాధిపై పోరాటానికి రూపొందించటిన వ్యాక్సిన్ కు స్పుత్నిక్-5 అని పేరు పెట్టింది. ఈ స్పుత్నిక్‌ను, ఆ స్పుత్నిక్‌ను గుర్తు చేస్తూ మహీంద్ర పెట్టిన పోస్టుకు బోలెడు లైకులు, కామెంట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement