Friday, May 24, 2024

అమూల్ గ‌ర్ల్ సృష్టి క‌ర్త సిల్వెస్ట‌ర్ డాకున్హా క‌న్నుమూత‌..

ముంబై – ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల బ్రాండ్‌ అమూల్‌ గర్ల్‌ యాడ్‌ సృష్టికర్త, ప్రముఖ అడ్వర్టైజింగ్‌ నిపుణు సిల్వెస్టర్‌ డాకున్హా (80) కన్నుమూశారు. సిల్వెస్టర్ డాకున్హా 1966లో జీసీఎంఎంఫ్‌ యాజమాన్యంలోని అమూల్ బ్రాండ్ కోసం ‘అట్టర్లీ బటర్లీ’ యాడ్‌ కోసం ‘అమూల్ గర్ల్’ని పరిచయం చేశారు. ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్‌లో కనిపించే పాపాయి కారణంగా అమూల్ బ్రాండ్‌కు ఎంతో కొత్త గుర్తింపు వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు అమూల్‌ గర్ల్‌ను కంపెనీ నేటికీ కొనసాగుతున్నది. ఆయ‌న మృతికి గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ట్విట్టర్ సంతాపం ప్ర‌క‌టించారు..అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సిల్వెస్టర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రకటనల రంగంలో అగ్రగామిగా నిలిచారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement