Monday, June 17, 2024

Election – లోక్ స‌భ బ‌రిలో 121 మంది నిశానిలు


ప్ర‌జా సేవ కోసం ఎన్నిక‌ల‌లో నిర‌క్ష‌రాస్యులు
అధిక శాతం మంది స్వతంత్ర అభ్య‌ర్ధులే
ప‌దో త‌ర‌గ‌తి లోపు చ‌దివిన వారు 1006 మంది
1502 మంది గ్రాడ్యుయేట్లు, 198 మంది డాక్ట‌రేట్లు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఇక ఆరో విడత శనివారం జరగనుండ‌గా, ఏడ‌వ‌దైన‌ చివ‌రి ద‌శ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఏడీఆర్ కీలక రిపోర్ట్‌ బయటపెట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8360 మంది అభ్య‌ర్ధుల‌లో దాదాపు 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యుల‌ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 359 మంది 5వ తరగతి వరకే చదువుకున్నట్లు తెలిపింది. 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది అభ్యర్థులు తాము 12వ తరగతి ఉత్తీర్ణులయ్యామని, 1,502 మంది అభ్యర్థులు తాము గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించుకున్నారు. ఇక డాక్టరేట్ పొందిన అభ్యర్థులు 198 మంది ఉన్నారు. మొదటి దశ ఎన్నికలలో 639 మంది అభ్యర్థులు తమ విద్యార్హతలను 5, 12వ తరగతులని చెప్పగా.. 836 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నారు. 26 మంది నిరక్షరాస్యులని చెప్పారు. నలుగురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. రెండో దశలో 533 మంది అభ్యర్థులు తమ విద్యా అర్హతలు 5, 12వ తరగతుల మధ్య ఉన్నాయని ప్రకటించగా, 574 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదివామని వెల్లడించారు. దాదాపు 37 మంది అక్షరాస్యులమని, ఎనిమిది మంది నిరక్షరాస్యులని చెప్పగా ముగ్గురు తమ విద్యార్హతలను అందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement