Thursday, June 13, 2024

NZB: మ‌త్స్య‌కారుల‌ వలకు చిక్కిన భారీ చేప..

డొంకేశ్వర్, ప్రభ న్యూస్: డొంకేశ్వర్ మండలంలోని నడుకుడా గోదావరి పరివాహక ప్రాంతంలో మ‌త్స్య‌కారుల‌కు భారీ చేప చిక్కింది. చేపల వేటకు వెళ్లిన అన్నారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రవి అనే మత్సకారుని వలలో భారీ చేప చిక్కుకుంది. భారీ చేప కట్ల బొచ్చ రకానికి చెందినదిగా, దాని బరువు 23కిలోలు ఉందని, ఆ చేపను నందిపేట గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు మత్స్యకారుడు ఎర్రోళ్ల రవి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement