Monday, June 24, 2024

NZB: భూవివాదంలో న్యాయం జరగలేదని… వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం..

పురుగుల మందు తాగి సీపీ కార్యాలయానికి వెళ్లి అపస్మారక స్థితిలో వెళ్లిన వైనం
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు..

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 11(ప్రభ న్యూస్) : తమకు చెందిన భూమిని కబ్జా చేశారని పోలీస్ స్టేషన్ లో, మున్సి పల్ కార్యాలయంలో, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తీవ్ర మనస్థాపానికి గురై నర్సమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఇవాళ‌ మధ్యాహ్నం మాక్లూర్ మండలం దాస్ నగర్ గ్రామానికి చెందిన నరసమ్మ అనే వృద్ధురాలు పురుగుల మందు సేవించి సీపీ కార్యాలయానికి వెళ్ళింది. ఈ క్రమంలో సీపీ కార్యాలయంలో నరసమ్మ అపస్మారస్థితిలోకి వెళ్ళింది. ఆమె వెంట వచ్చిన కూతురు గంగలక్ష్మీ, మనవడు, మనవరాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడున్న అధికారులు అంబులెన్స్ ద్వారా నరసమ్మను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధిత మహిళ కూతురు గంగలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం దాస్ నగర్ గ్రామానికి చెందిన నరసమ్మ అనే వృద్ధురాలికి చెందిన 20 గజాల భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని గత కొన్ని రోజులుగా, స్థానిక పోలీస్ స్టేషన్ లో, మున్సిపల్ కార్యాలయంలో, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు త‌మకు న్యాయం జరగలేదని వాపోయారు. అంతేకాకుండా త‌మ భూమిని కబ్జా చేయడమే కాకుండా ఒంటరిగా ఉన్న త‌మ అమ్మ (నరసమ్మ)ను భయ భ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని త‌మకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement