Wednesday, May 15, 2024

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ హెచ్చరిక..

ఉక్రెయిన్‌లో రష్యా అనుసరిస్తున్న కర్కశ విధానాలు, పౌరుల ఊచకోత, మూకుమ్మడి హత్యలపై ఆధారాలు సేకరించామని, రష్యా యుద్ధనేరాలపై డాక్యుమెంటరీ సిద్ధం చేశామని, అంతర్జాతీయ న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడతామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ హెచ్చరించింది. రాజధాని కీవ్‌, దాని పరిసర గ్రామాలు, బుచా పట్టణంలో రష్యా బలగాలు చేసిన దారుణ హత్యలు, విధ్వంసానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యాలు లభ్యమైనాయని పేర్కొంది. దుశ్చర్యలకు పాల్పడిన రష్యా బలగాల్లోని బాధ్యులను కోర్టుకు ముందు నిలబెడతామని ఆ సంస్థ సెక్రటరీ జనరల్‌ అగ్నెస్‌ కల్లామర్డ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉక్రెయిన్‌ సైనికుల చేతులు వెనక్కి కట్టి దారుణంగా హతమార్చి రోడ్లపై చెల్లచెదురుగా పడేసిన దృశ్యాలను రికార్డు చేశామని చెప్పారు. సామూహిక ఖననాల వివరాలు సేకరించామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement