Monday, April 29, 2024

ఇజ్రాయిల్‌కు పుతిన్‌ క్షమాపణ, అబ్బే.. అదేం లేదన్న రష్యా

అభిజాత్యం, మొండితనానికి మారుపేరుగా చెప్పుకునే పుతిన్‌ ఇజ్రాయిల్‌ విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించారా? అంటే ఇజ్రాయిల్‌ అవునంటోంది. జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌లో యూదు మూలాలున్నాయని, హోలోకాస్ట్‌ కు వ్యతిరేకంగాను రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో పుతిన్‌ జోక్యం చేసుకుని ఇజ్రాయిల్‌కు క్షమాపణ చెప్పారని, తాము వాటిని స్వీకరించామని సాక్షాత్తు ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్టే ప్రకటించడం విశేషం. అయితే దీనిని రష్యా వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. తాజా వివాదం నేపథ్యంలో ఉద్రిక్తతల నివారణకు కలసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయే తప్ప దేశాధ్యక్షుడు పుతిన్‌ క్షమాపణలు చెప్పలేదని బుకాయిస్తున్నాయి.
రష్యా యుద్ధనేరాలు నిరూపిస్తాం

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement