Friday, September 22, 2023

Followup | అంబులెన్సుకు నిప్పు.. ముగ్గురు సజీవదహనం

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా అల్లర్లు చెలరేగాయి. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒక బాలుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా వాహనానికి ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడు,అతడి తల్లితోపాటు వారి బంధువు ఒకరు సజీవ దహనం అయ్యారు. పశ్చిమ ఇంఫాల్‌లోని ఇరోయిసెంబా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

- Advertisement -
   

ఆదివారం రాత్రి అసోం రైఫిల్స్‌ శిబిరంపై దాడి జరిగింది. ఆ సందర్భంలో 8 ఏళ్ల బాలుడి తలకు బుల్లెట్‌ గాయమైంది. అతడిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. అంబులెన్సుకు కొంతదూరం అసోం రైఫిల్స్‌ సిబ్బంది ఎస్కార్ట్‌గా వెళ్లారు. ఆ తర్వాత స్థానిక పోలీసులు ఆ బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు అంబులెన్సుకు నిప్పు పెట్టడంతో అందులోని ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement