Sunday, June 4, 2023

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

నగరంలోని పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ విగ్రహం ఏర్పాటుకు వీహెచ్‌ అయితే.. ప్రత్యేకంగా పోరాటం చేశారు. ఈ తరుణంలోనే తాజాగా పంజాగుట్ట సెంట్రల్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఏప్రిల్ 14న విగ్రహం ఆవిష్కరణ చేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్ సెంట్రల్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement