Saturday, April 27, 2024

ఈ రోజు సాయంత్రం బతుకమ్మ పాట విడుదల..

తెలంగాణ జాగృతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బతుకమ్మ పాట ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు విలక్షణ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాశారు. ఉత్తరా ఉన్నికృష్ణన పాడారు. జాతీయ అవార్డు గ్రహీత బృందం కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎమ్మెట్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్‌ మీనన్ విడుదల చేయనున్నారు. కాపీరైట్‌ లేకుండా హెచ్‌డీలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు.

ఇది కూడా చదవండి: ‘‘భార్యాభర్తల” ప్రైవసీ మనకెందుకు?: ఖుష్బూ

Advertisement

తాజా వార్తలు

Advertisement