Wednesday, May 8, 2024

కానిస్టేబుల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఏపీ సేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూ ట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ మనీష్‌కుమార్‌ సిన్హా పర్యవేక్షణలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. మొత్తం 6511 పోలీసు ఉద్యోగాల్లో 6100 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఇప్పటికే హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 5,03,486 మంది నిరుద్యోగులు ఈనెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జ రిగే ప్రాధమిక పరీక్షకు హాజరుకానున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు సి ద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ జిల్లాల్లో ఎస్పీలు అధికారులతో కలిసి పరీక్షా కేంద్రాల ను పరిశీలించారు. ఇందుకు సంబంధించి పకడ్బందీ ఏర్పా ట్లు చేశారు. ఇక ఆరోజు జరిగే ప్రాధమిక పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్‌ రూముల్లో భద్ర పరిచారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. కానిస్టేబుల్‌ పరీక్ష దృష్ట్యా పోలీసు అధికారులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌లతో ఉన్నతాధికారులు వివిధ జిల్లాల్లో సమీక్ష సమా వేశాలు నిర్వహించారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమేరాల పనితీరును ప్రత్యేకంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతా అంశాలు, ఏర్పాట్లపై అధికా రులకు పలు సూచనలు చేశారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద జాగ్రత్తలు, అనుసరించాల్సిన నియమ నిబందనలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

స్ట్రాంగ్‌ రూముల వద్ద పహారాలో ఉన్న ఆర్‌ ్మడ్‌ రిజర్వు గార్డ్‌లు నిరంతరం అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష రాసే గదులు, పరిసర ప్రాంతాలను, పార్కింగ్‌, వెలుతురు, మంచినీటి సదుపాయం, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ట భద్రత., ఇతర ఏర్పాట్లను నిబందనల ప్రకారం పూర్తి చేస్తున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్ట బందోబస్త్‌ చర్యలను చేప డుతున్నామని, పోలీసు అధికారులు, రీజనల్‌ కోఆర్డినేట ర్లతో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రతి పరీక్ష కేంద్రంకు ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మూడు నాలుగు కేంద్రా లకు క్లస్టర్‌గా చేసి ఒక ఇన్‌స్పెక్టర్‌ను ఇన్‌ఛార్జి గా నియమిం చారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేలా ప్లయింగ్‌ స్క్వాడ్‌లు నిరంతరం ఆయా కేంద్రాలకు తిరుగుతూ ఉంటా యని తెలియచేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు నియ మ నిబంధనలను పాటిస్తూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని, క్రమశిక్షణ పాటిస్తూ శ్రద్దగా పరీక్షలు రాయాలని తెలిపింది.

అదేవిధంగా పరీక్షల సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో ఎస్పీల నేతృత్వంలో అధికారులు ముందస్తు చర్యలు చేపడ ుతున్నారు. రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు- చేశారు. అభ్యర్ధులకు ఏవైనా సమస్యలు, అవాంతరాలు ఎదురైతే వెంటనే సహా యం కోసం డయల్‌ 100,112కు కాల్‌ చేసేలా ఏర్పాట్లు చేశా రు. 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యా హ్నం ఒంటిగంట వరకు రాత పరీక్ష జరుగనుంది. అభ్యర్ధులు రెండు గంటలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని బోర్డు సూచించింది. ఉదయం 9 గం టల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగు తుంది. పరీక్షా సమయం 10 గంటలకి ఒక నిమిషం దాటినా అభ్యర్థులను వ్రాత పరీక్షకు అనుమతించరు. రాత పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్‌లో సూచించే నియమ నిబంధనలు పాటించాలి. మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ వాచ్‌, బ్లూటూత్‌ తది తర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ పరీక్ష హాల్లోకి అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్‌ షాపులు, కోచింగ్‌ సెంటర్లు మూసి వేయబడును. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పరీక్షా కేం ద్రాల వద్ద 144 సెక్షన్‌, సెక్షన్‌-30 పోలీసు యాక్టు అమల్లో ఉం టుంది. అందువల్ల పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడ డం నిషేధం. అదనపు ఎస్పీ స్ధాయి అధికారులు నోడల్‌ ఆఫీ సర్లుగా, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద డిఎస్పీలు, సిఐలతో ప్లnయిం గ్‌ స్క్వాడ్‌లు సంచరిస్తూ ఉంటాయి. ప్రతీ కేంద్రం వద్ద
మఫ్టీలో నిఘా ఉంటుంది. పరీక్షా కేంద్రానికి హాల్‌ టికెట్‌, ఒరిజినల్‌ గవర్నమెంట్‌ అప్రూవ్డ్‌ ఐడి కార్డ్‌, బ్లాక్‌ లేదా బ్లూ పాయింట్‌ పెన్‌ తో మాత్రమే అభ్యర్ధులను అనుమతిస్తారు.

జిల్లాల వారీగా హాజరయ్యే సంఖ్య
జిల్లాల వారీగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు శ్రీకాకుళం – 50268, విజయనగరం – 40321, విశా ఖపట్నం – 50002, తూర్పు గోదావరి – 42501, పశ్చిమ గోదావరి – 27504, కృష్ణా జిల్లా – 34791, గుంటూరు జిల్లా – 37526, ప్రకాశం – 33484, నెల్లూరు జిల్లా – 25132, కర్నూలు జిల్లా – 51972, కడప జిల్లా – 27217, అనంతపురం జిల్లా – 41133, చిత్తూరు జిల్లా – 33 934 అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తు చేస్తున్న 7 వేల 701 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 5,03,486 మంది అభ్యర్థుల్లో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళాభ్యర్థులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement