Saturday, April 27, 2024

అగ్నిన‌క్ష‌త్రంలో నాన్న‌తో క‌లిసిన‌టిస్తున్నా – మంచు ల‌క్ష్మి

అగ్ని న‌క్ష‌త్రం చిత్రంలో త‌న తండ్రి..న‌టుడు మోహ‌న్ బాబుతో క‌లిసి న‌టిస్తున్నాన‌ని న‌టి..నిర్మాత మంచు ల‌క్ష్మీ తెలిపారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసిందని చెప్పారు. తన తండ్రిలో కలిసి నటించడమే కాకుండా, ఆయనతో కలిసి సినిమాను కూడా నిర్మిస్తున్నానని చెప్పారు. తమ చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే టైటిల్ ని ఖరారు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నామని అన్నారు. ప్రతీక్ ప్రజోశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రత్యర్థులుగా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ‘పిట్టకథలు’ వెబ్ సరీస్ తర్వాత మంచు లక్ష్మి నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement