Sunday, April 28, 2024

Exclusive: కొత్త‌గూడెం ఎస్పీ సునీల్​ దత్​ బ‌దిలీ?.. నూత‌న ఎస్పీగా ఓఎస్‌డీ వినీత్‌కు బాధ్య‌త‌లు

భ‌ద్ర‌ద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీగా ఉన్న సునీల్​ దత్​ బదిలీ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన ప్లేస్​లో ఇప్పటికే అక్కడ ఆపరేషన్స్​ ఆన్​ స్పెషల్​ డ్యూటీపై పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్​ డాక్టర్​ వినీత్​కు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే.. ఏజెన్సీ ఏరియాలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చికున్న ప్రస్తుత సునీల్​ దత్​ అకస్మిక బదిలీకి కారణాలు తెలయవలసి ఉంది. ఈ ట్రాన్స్​ఫర్​కి సంబంధించిన ఉత్తర్వులు మరికొద్ది సేపట్లో వెలువడనున్నట్టు సమాచారం. కాగా, ఎస్పీ సునీల్​ దత్​ని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement