Monday, June 5, 2023

మధ్యప్రదేశ్‌లో ఆఫ్రికన్‌ స్వైన్‌ ప్లూ

మధ్యప్రదేశ్‌లో ఆఫ్రికన్‌ స్వైన్‌ ప్లూ కలకలం రేపుతోంది. దమోహ్‌ జిల్లాలో పందులకు ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ సోకిన 700 పందులను చంపేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గత పదిహేను రోజులుగా వరసగా జంతువులు చనిపోతున్నాయి. ఈ ఘటనపై విచారించిన వెటర్నరీ డాక్టర్లు జంతువులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థారించారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ సోమిల్‌ రాయ్‌ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం సూచన మేరకు అనారోగ్యంతో ఉన్న పందుల నమూనాలను సేకరించి విశ్లేషించామని జిల్లాలోని హటా, బనావర్‌ ప్రాంతంలో ఆఫ్రికన్‌ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించామని, ఫలితంగా ఆ ప్రాంతంలో వ్యాధి వ్యాపించిందని.. దీంతో పందునలు చంపుతున్నట్లు వెల్లడించారు. పందులను చంపేసి జేసీబీల సాయంతో పూడ్చివేస్తున్నారు. దమోహ్‌ జిల్లా కలెక్టర్‌ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి సోకిన ప్రాంతాల్లో పందులను చంపేస్తున్నామని.. ఎవరైనా పందుల కాపరిలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement