Sunday, May 19, 2024

AFG vs NED | నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా లక్నో వేదికగా జ‌రిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ జట్టుపై 7 వికెట్లతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను తక్కువ స్కోర్‌‌కే ఆలౌట్ చేసిన ఆఫ్గానిస్తాన్.. చేజింగ్‌లోనూ ఆకట్టుకంది. 31.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి నెదర్లాండ్స్ నిర్ధేశించిన టార్గెట్ ని అలవోకగా ఛేదించింది.

దీంతో, సెమీస్‌లో అడుగు పెట్టాలని పట్టుదలగా ఉన్న అఫ్గానిస్థాన్‌ ఆ దిశగా తొలి అడుగు వేసింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న అఫ్గాన్‌ నేడు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐదో స్థానానికి చేరుకుంది.

ఆఫ్గాన్ బ్యాటర్లలో, రెహ్మత్‌ షా.. (52), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (56 నాటౌట్‌) హాఫ్ సెచరీలతో ఆకట్టుకున్నారు. ఇక, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (31 నాటౌట్‌) పరుగులతో రాణిచించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement