Sunday, May 5, 2024

AP | రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంపుకు అటవీశాఖ కసరత్తు

అమరావతి, ఆంధ్రప్రభ : మడ అడవులు.. పర్యావరణకు ప్రకృతి ప్రసాదించే వరాలు. తీర ప్రాంతాలకు రక్షణ గోడలు. సముద్ర తీర జీవవైవిధ్యంలో వీటి దే కీలక పాత్ర. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మనుషుల్ని, వన్య ప్రాణుల్ని కాపాడుతున్నాయి. లక్షలాది మంది జీవనోపాధికి అసరాగా నిలుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో జీవ మనుగడ, పర్యావరణ సమత్యులత కాపాడేందుకు ఈ మడ అడవులు ఎంతగానో దోహదపడతాయి. నదీ ముఖద్వారాల వద్ద.. సముద్ర ఆటుపోట్లకు గురయ్యే ప్రదేశాల్లో పెరిగే ప్రత్యేక జాతికి చెందిన మొక్కలను మడ అంటారు.

వందలాది ఎకరాల్లో దట్టంగా అల్లుకుపోయే వీటి సమూహాన్ని మడ అడవులుగా పిలుస్తారు. ఇవి ఉప్పు నీటిని తట్టుకుంటాయి. పోటు సమయంలో నీట మునిగినా చచ్చిపోవు. కొన్ని మొక్కల ఆకుల్లో ఉప్పును స్రవించే గ్రంథులుంటాయి. వీటి వేర్లు ఉప్పు నీటిని వడపోసి మంచినీటిగా మార్చుకుంటాయి. మడ చెట్లు ముఖ్యంగా మత్స్య సంపద పెరగటానికి, సముద్ర కోతను అరికట్టడానికి, తుఫాన్లు, సునామీల తీవ్రత నుంచి తీర గ్రామాలను రక్షించటానికి ఉపయోగపడతాయి.

- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యం కలిగిన మడ అడవులు తీ ర ప్రాంత ప్రజలను కాపాడే సహజసిద్ద కవచాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లో 1.4 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మడ అడవులున్నాయి. ఇందులో 50 లక్షల హెక్టార్లకు పైగా ఆసియా ఖండంలోనే ఉండటం గమనార్హం. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువగా మడ అడవులు ఉన్నాయి. గోదావరి తీరంలో కాకినాడ, బీఆర్‌ అంబేద్కర్‌ జిల్లాలు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఇవి విస్తరించాయి.

ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొద్దిమేర మడ అడవులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా మడ అడవులు తగ్గుతుండటంతో, రాష్ట్రంలో ఈ అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా బంగాళాఖాతం తీర ప్రాంతాన్ని ఆనుకుని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలోని కోరంగిలో ఉన్న మడ అడవులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ముఖ్యంగా సముద్ర తీరం కోతకు గురి కాకుండా కాపాడటంలోను, ఎన్నో రకాల జలచరాలకు ఆశ్రయం ఇవ్వడంలోను మడ అడవులది ప్రత్యేక స్థానం. ఇటీవల పర్యటకంగానూ మడ అడవులు ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ 187.81 చదరపు కి లోమీటర్ల మేర ఉండగా, ఆ తర్వాత కృష్ణా అభయారణ్యంలో 137.76 చదరపు కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపింవున్నాయి. కోరింగ మడ అడవుల్లో 34 రకాల మొక్కలు ఉన్నట్లు అంచనా. నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు.

ఇలా ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాల జీవజాలం ఈ మడ అడవుల్లో నివసిస్తున్నాయని అక్కడివారు చెబుతున్నారు. పొన్న, నల్లమడ, కళింగ, గుగ్గిలం మొదలైనటువంటి మడ జాతి మొక్కలతో దట్టమైన వృక్షసంపదతో పాటు, చేపలు పట్టు పిల్లి, నీటికుక్క, నక్క వంటి జంతు సంపద ఇక్కడ కనిపిస్తాయి. నీటి పిల్లా (మరకపల్లి, ఏటిపిల్లి) అనే వన్య ప్రాణితో పాటు అనేక జంతువులు, పక్షులకు ఆవాసంగా నిలుస్తున్నాయి. విదేశీ పక్షులకూ విడిది కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి. అంతే కాదు కృష్ణాజిల్లాలోని నాగాయలంక మండలం పరిధిలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో విస్తరించిన మడ అడవులు అరుదైన జంతువులు, పక్షలకు అవాసంగా మారాయి.

దేశంలోనే అరుదుగా కనిపించే పిషింగ్‌ క్యాట్‌ (బావురుపల్లి) ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. నీటి కుక్కలు, అరుదైన సముద్రపు తాబేళ్లు, పెలికాన్‌ (గూడబాతు), కింగ్‌ ఫిషర్స్‌ పక్షులు తదితర పక్షిజాతులు ఈ ప్రాంతంలో సందడి చేస్తుంటాయి. 2021 ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోనే అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను నమోదు చేసిన రాష్ట్రాల్లో 647 చదరపు కి లోమీటర్ల వృద్ధిరేటు ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో నిలిచింది. 632 చ దరపు కిలోమీటర్ల వృద్ధితో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, 537 చ.కి.మీ వృద్ధితో ఒడిశా మూడో స్థానంలో ఉంది.

నదీ తీర ప్రాంతాలతో పాటు నదులు సముద్రంలో కలిసే భూభాగంలో మొక్కలు నాటడం ద్వారా విస్తీర్ణం పెరుగుతోంది. మడ అడవులు పెంచేందుకు అనువైన ప్రాంతాలన్నీంటినీ సమర్థంగా ఉపయోగించుకునేందుకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందించింది. సముద్ర జలాలు చొచ్చుకుని వచ్చే ప్రాంతాలల్లో వీటిని పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. చిత్తడి నేలలో పెరిగే ఈ చెట్ల వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. మామూలు నేలలో పెరిగే చెట్ల వేర్లు భూమి లోపలికి పెరుగుతాయి. కానీ ఇక్కడ నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి.

కాబట్టి, భూమిలోకి ఉండే వేర్ల వల్ల ఈ చెట్లకు కావాలిసినంత ఆక్సిజన్‌ తీసుకునే అవకాశం తక్కువ. అందువల్ల మడ అడవులలో పెరిగే మొక్కల వేర్లు భూమిపైకి కనబడతాయి. వీటి నుంచి కొత్త మొక్కలు రావడం వల్ల ఇక్కడ చెట్లు దట్టంగా గుబురుగా పెరుగుతాయి. ఇలాంటి చిత్తడి అడవులు కేవలం నదీసాగర సంగమ ప్రదేశాలలో ఏర్పడ్డ బురద నేలల్లోనే కనిపిస్తాయి. గంగానది తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు మన దేశంలో అతిపెద్ద మడ అడవులైతే.. రెండోది గోదావరి తీరంలోని ఈ కోరంగి మడ అడవులు కావడం గమనార్హం.

మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచండి : సీఎస్‌

రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచి అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల క్రితం కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్మెం ట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కాంపా) 20వ స్టీరింగ్‌ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిన విషయం విధితమే. ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మడ అడవులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సూచించారు. తీర ప్రాంత జిల్లాల్లో అవకాశం ఉన్నచోట్ల మడ అడవుల పెంపకానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement