Monday, April 29, 2024

ల‌గ్జ‌రీ బైక్ కొన్న న‌టి మంజువారియ‌ర్..

త‌మిళ స్టార్ హీరో అజిత్ తో క‌లిసి తునివు చిత్రంలో న‌టించింది న‌టి మంజువారియ‌ర్. కాగా ఆమె రీసెంట్ గా BMWRL1250 GS బైక్ ని కొనుగోలు చేసింది.ఈ బైక్ రూ. 21 లక్షలట‌. ధైర్యం ముందడుగు వేయడానికి మంచి ప్లేస్.. రంగం అవసరం. నేను మంచి రైడర్ గా మారడానికి చాలా దూరం ప్రయాణించాలి. కాబట్టి నేను రోడ్లపై తడబడటం మీరు చూస్తే దయచేసి నాతో ఓపికగా వ్యవహరించండి. నాలో స్ఫూర్తిని రగిలించినందుకు హీరో అజిత్ కుమార్ సార్ కు కృతజ్ఞతలు’ అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతే కాకుండా ఈ అందమైన క్యాప్షన్ కి తోడు గులాబీ షర్ట్ బ్లాక్ జీన్స్ ధరించి షో రూమ్ లో సందడి చేసిన వీడియోని షేర్ చేసింది.ఆ తరువాత హెల్పెట్ పట్టుకుని BMWRL1250 GS బైక్ పక్కన నిలబడి హల్ చల్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది. హీరోలకు ధీటుగా మంజు వారియర్ బైక్ రేసర్ గా మారాలని కొత్తగా అడుగులు వేస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement