Friday, April 26, 2024

వ్యర్ధాలతో చేపలు సాగు చేస్తే కఠిన చర్యలు.. తనిఖీ చేస్తున్న మత్స్యశాఖ అధికారులు

బుచ్చిరెడ్డిపాలెం, ప్రభన్యూస్ : చాపలను మాంసపు వ్యర్ధాలు వేసి పెంచితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మత్స్యశాఖ సంయుక్త సంచారకులు నాగేశ్వరరావు హెచ్చరించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని దామరమడుగులో వ్యర్ధాలను తరలిస్తున్న మహేంద్ర వాహనాన్ని దాడులు చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాపలను ఎవరైనా మాంసపు వ్యర్ధాలు వేసి పెంచడం చట్టరీత్యా నేరం అన్నారు.

వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. స్వాధీనం చేసుకున్న వ్యర్ధర వాహనానికి మొదట విడత హెచ్చరికగా 10000 రూపాయలు జరిమానా విధించామన్నారు. వాహనాన్ని ఆర్టీవో అధికారులకు అప్పజెప్పడం డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాల్సిందిగా సిఫారసు చేస్తున్నామన్నారు. ఇకపై ఎవరైనా వ్యర్ధాలు తరలిస్తే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎఫ్డిఓ పొట్టయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement