Thursday, May 2, 2024

వాల్తేరు వీరయ్య చిత్రం నుండి.. బాబీ సింహా ఫస్ట్ లుక్ పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి మాంచి జోరుమీదున్నాడు. పలు ప్రాజెక్టులతో బిజీగా మారారు. కాగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నారు చిరంజీవి.చిరంజీవికి జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి బాబీ సింహా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. నేషనల్‌ అవార్డు విన్నర్‌ బాబీ సింహా వాల్తేరు వీరయ్యలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహా సోలోమాన్‌ సీజర్‌గా నటించనున్నారు. ఆదివారం బాబీసింహా పుట్టిన రోజు సందర్భంగా వాల్తేరు వీరయ్యలోని లుక్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement