Tuesday, April 30, 2024

న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం.. శ్రీ‌వారి ఆల‌యం మూత.. బ్రేక్ ద‌ర్శనాలు రద్దు..

తిరుమ‌ల : చంద్ర‌గ్రహణం కారణంగా న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం ఉద‌యం 8.30 నుండి రాత్రి  దాదాపు 7.30 గంట‌ల‌ వరకు 11 గంటల పాటు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. చంద్ర‌గ్రహణం కారణంగా శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను టిటిడి రద్దు చేసింది. రాత్రి 7.30 గంట‌లకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement