Saturday, March 25, 2023

రూ.55 కోట్లు మోసం.. న‌టుడు న‌వీన్ రెడ్డి అరెస్ట్

ఫోర్జ‌రీ కేసులో అరెస్ట్ అయ్యాడు న‌టుడు న‌వీన్ రెడ్డి.ఈయ‌న ఎన్ స్వ్కేర్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేసి..కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. .. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై సెక్షన్లు 420, 465,468,471 r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు సీసీఎస్‌ పోలీసులు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నవీన్‌ను చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. కాగా మోసం చేసిన డబ్బులతో నవీన్‌ జల్సాలు చేశాడని బాధితులు చెబుతున్నారు. అలాగే తనే హీరోగా నోబడీ అనే సినిమా కూడా తీశాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement