Friday, April 26, 2024

క్రూడ్‌ ధరలు తగ్గితేనే విండ్‌ఫాల్‌ పన్ను రద్దు..

ప్రభుత్వం ఇటీవల పెంచిన విండ్‌పాల్‌ పన్నును అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ధరలు 40 డాలర్లకు దిగి వచ్చినప్పుడే తగ్గిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చమురు కంపెనీలు దేశీయ అవసరాలను పట్టించుకోకుండా, విదేశాలకు చమురు ఎగుమతి చేసి అధిక లాభాలు అర్జిస్తుందని గుర్తించిన ప్రభుత్వం విండ్‌ పాల్‌ పన్నుతో పాటు, ఎగుమతి సుంకాలను విధించింది. ఈ పన్నులు జులై 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దేశీయంగా సప్లయ్‌ పెంచడం , ఆదాయం పెంచుకోవడం కోసమే ఇలా పన్నులు విధించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు పన్నులు పెంచడం ద్వారా ప్రభుత్వానికి 72 వేల కోట్ల ఆదాయం రానుంది. విండ్‌పాల్‌ పన్నును చమురు ఉత్పత్తిపైనా, ఎగుమతి పన్నులు పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనంపై విధించారు.

ఓఎన్జీసీ, ఆయిల్‌ ఇండియా, రిలయన్స్‌, నయారా ఎనర్జీ, వేదాంత కంపెనీలు చమురును విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
చమురు ధరలను ప్రతి 15 రోజులకు సమీక్షిస్తామని, అంతర్జాతీయ ధరలు తగ్గితే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బ్యారెల్‌కు 40 డాలర్లకు లోపుగా వస్తే విండ్‌పాల్‌ పన్నును తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement