Sunday, May 19, 2024

Breaking | క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌.. లోయ‌ర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే చాన్స్‌!

క‌రీంన‌గ‌ర్‌లోని లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద పోటెత్తుతోంది. ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్షాల‌తో ఏక్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. గ్రామాలలో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతంలోకి పశువులు గాని, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాల‌ని, అలాగే చేపలు పట్టేవారు, గొర్రెల‌ కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ఇరిగేష‌న్ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement