Saturday, May 4, 2024

చెన్నైలో నైట్ కర్ఫ్యూ – వీటికి మాత్రమే అనుమతి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు వ్యాప్తిని అరికట్టడానికి నైట్ కర్ఫ్యూ తో పాటు కొన్ని ఆంక్షలను విధించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం నాలుగు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని.. ఇక కొత్తగా పెట్టిన ఆంక్షలు ఏప్రిల్ 20 నుంచి అమలులోకి రానున్నాయని ప్రకటించింది.

వచ్చే ఆదివారం నుంచి ఆదివారం కర్ఫ్యూ లు కూడా అమలు చేయనున్నారు. అయితే అవసరమైన సేవలను మాత్రం అనుమతించనున్నారు. రాత్రి సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రవాణాను ఇక అనుమతిలేదని అలాగే ఇంటర్ స్టేట్ పబ్లిక్ మరియు ప్రైవేటు రవాణాను కూడా నిలిపి వేయనున్నట్లు ప్రకటించారు. రైల్వే స్టేషన్లకు, విమానాశ్రయాలకు అత్యవసరాలకు మాత్రం ఆటోలు, టాక్సీలు వంటి వాటికి అనుమతించనున్నారు. ఇక పెట్రోలియం రవాణా వాహనాలను కూడా అనుమతించనున్నారు. అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లు రాత్రి సమయంలో కూడా పని చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే రాత్రి షిఫ్టుల్లో పని చేసే ఉద్యోగులు తమ సొంత వాహనాలు ఉపయోగించడంతో పాటు ఐడి కార్డు కూడా కలిగి ఉండాలని ఆంక్షల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement