Monday, April 29, 2024

ముంచెత్త‌నున్న కొత్త‌ వేరియంట్.. వాస్తవ లెక్కలకంటే పది రెట్లు ఎక్కువ వ్యాప్తి..

భారతదేశంలోకి మూడోవేవ్ ప్రవేశిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా మళ్లి రోజువారి కొవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న మొత్తం కేసుల్లో కొత్త వేరియంట్ రకం కేసులు కేవలం 2శాతం కంటే తక్కువేనన్న అధికారిక ప్రకటనలు మాటెలావున్నా, వాస్తవ గణాంకాలు చాలా అధికంగా ఉంటున్నాయి. త్వరలోనే ఒమిక్రాన్‌ సునామీ దేశాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందఅని ఓ ఆంగ్ల జాతీయ చానల్‌ తన పరిశోధనలో పేర్కొంది. దేశంలో అధికారిక ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1500గా అంచనా వేయబడుతోంది.కానీ ఇది వాస్తవానికి పది రెట్లు అధికం. దాదాపు 18000వేలకు చేరుకుని ఉండొచ్చు. ఇప్పుడి ప్పుడే మనదేశం కూడా ప్రపంచ గణాంకాలను అనుసరిస్తోంది. కొన్నిదేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం కొత్త వేరియంట్‌ రకానివే ఉన్నాయి. ఒమిక్రాన్‌ను గుర్తించడానికి, వేగంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు చేయడానికి మనవద్ద ల్యాబ్‌ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. అందుచేత వాస్తవ గణాంకాలు వెల్లడవడం లేదు. ఈ వారం ఢిల్లి, ముంబైలోని జీనోమ్‌ ల్యాబ్‌ల లెక్కల ప్రకారం, ఒమిక్రాన్‌ కేసులు 60 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కిందటి వారం 37 శాతంగా ఉండేదని ముంబైలోని మరో ఒమిక్రాన్‌ ల్యాబ్‌ తదుపరి నివేది కలో పేర్కొంది. అయితే, డెల్టా కంటే ఒమిక్రాన్‌ తక్కువ తీవ్రత ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తున్న విషయమే కాస్తంత ఊరటనిచ్చే సంగతి.

డెల్టా కంటే మూడు నాలుగు రెట్లు వేగంగా వ్యాపించే లక్షణమున్న ఒమిక్రాన్‌ కారణంగా, అధిక జనాభా కలిగిన భారత దేశంలో రోజువారి కేసులు మునుపటి రికార్డులను అధిగమించొచ్చని తెలుస్తోంది. ప్రతి రోజు గరిష్టంగా 16 నుంచి 20 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉం దని వైరస్‌ వ్యాప్తి సరళినిబట్టి తెలుస్తోంది. దీని కారణంగా మన వైద్య వ్య వస్థ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్యులు, ఔషధాల లభ్యత తీవ్ర ఒత్తిళ్ల కు గురికావొచ్చు. ప్రతి 100 డెల్టా కేసుల్లో ఆరుగురు ఆస్పత్రిలో చేరితే, ఒమిక్రాన్‌ విషయంలో ఇది మూడింటికి పరిమితం కావొచ్చు. అయితే, కేసుల సంఖ్య నాలుగైదు రెట్లు అధికంగా ఉంటున్నందున, ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య రోజుకు 60 వేలకు చేరుకునే అవకాశం ఉంది. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ, ఇది తక్కువ వ్యవధికే పరిమితం అవుతుందన్న విశ్లేషణలు సాను కూలాంశం. ఏదేమైనా భారతదేశం మునుముందు థర్డ్‌వేవ్‌ నుంచి భయానక పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం సూచిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement