Friday, May 3, 2024

Big Story: క్రాప్ టాప్స్, ‘నేక్ డ్’ ఫ్యాషన్.. అట్లాంటి బట్టలుంటే విమానం ఎక్కనీయరు..

పొట్టి దుస్తులు.. తొడలు కనిపించేలా ఉండే బట్టలు వేసుకోవడం ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ గా భావిస్తున్నారు. విదేశాల నుంచి మన ప్రాంతానికి ఇది బాగా అలవాటుగా మారింది. అంతేకాకుండా సిటీలు, పట్టణాలు,  మండలాలు.. గ్రామాల దాకా ఈ విష సంస్కృతి చేరింది.. అయితే ఇట్లాంటి డ్రెస్సింగ్స్ తో ఎయిర్ పోర్టుకు వస్తే కుదరదు అంటున్నారు ఆస్ట్రేలియా ఎయిర్ లైన్స్ వారు. పొట్టి డ్రెస్ లు వేసుకుని విమానాల్లో జర్నీ చేయడంపై నిషేధం కూడా విధించారు. ఇట్లాంటి వివాదాస్పద డ్రెస్ వేసుకుని ఎయిర్ ప్లేన్ ఎక్కేందుకు వచ్చిన మహిళను బోర్డింగ్ లోకి అనుమతింకలేదు అక్కడి క్యాబిన్ సిబ్బంది. మహిళా ప్రయాణికుల దుస్తుల ఎంపికపై కంప్లెయింట్ కూడా చేశారు. క్రాప్ టాప్స్, స్కిన్-టైట్ షార్ట్ లు, స్పోర్ట్స్ బ్రాలు “కించపరిచే” వస్త్రాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక మామ్ తన “అనుచితమైన” దుస్తులపై పోలీసులతో ఏం చెప్పారంటే.. ఆమె గెటప్ “న్యూడ్”గా  కనిపించినందున బోర్డింగ్ నుండి ఆపేశాం. కాంట్రవర్సల్ డ్రెస్ లతో విమాన ప్రయాణాలు చేయకూడదు’’ అని చెప్పారు.

గత జులైలో ఒక ఫిట్‌నెస్ మోడల్ తను వేసుకున్న డ్రెస్ బాగా లేదని, న్యూడ్ గా ఉందని విమానం ఎక్కకుండా క్యాబిన్ సిబ్బంది అడ్డుకున్నారు. టర్కీ నుంచి అమెరికాకు వెళ్లిన డెనిజ్ సైపినార్ టెక్సాస్ నుంచి మియామీకి వెళ్లబోతుండగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమాన సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఆమె.. “టెక్సాస్ ఎయిర్‌పోర్ట్ లో నాకు అవమానమే జరిగిందని చెప్పాలి. ఇలాంటి విషయాన్ని మీరు ఎప్పటికీ నమ్మరు. మీరు న్యూడ్ గా ఉన్నారు, ఇతర విమాన ప్రయాణికులను, వారి ఫ్యామిలీస్ ని కించపరిచేలా డ్రెస్ వేసుకున్నారు” అని నన్ను లిటరలీ విమానంలో నుంచి బయటికి గెంటేశారనే చెప్పవచ్చు”.. అని ఇన్ స్టాలో పోస్టు చేసింది.  దీనిపై మరో మహిళ కామెంట్ చేస్తూ… “ఒక మహిళ మీలా స్వేచ్ఛగా ఉండటం వారికి ఇష్టం లేదనుకుంటా’’.. అని రిప్లయ్ ఇచ్చింది.. ఆమె డ్రెస్ ఆధారంగా విమాన ప్రయాణాన్ని అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది.. అయితే ఈ విషయంపై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

ఇట్లాంటిదే తనకూ ఎదురైందని మరో యువతి పేర్కొంది. “నేను న్యూడ్ గా లేను” అని తన షార్ట్, క్రాప్ టాప్ చూపిస్తూ  పోస్టు పెట్టింది. అయినా తనను విమాన ప్రయాణం చేయకుండా అడ్డుకున్నారని వాపోయింది. దీనికి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు. “జులై 8న డల్లాస్- ఫోర్ట్ వర్త్ నుండి మయామికి ప్రయాణిస్తున్న కస్టమర్‌కు అమెరికన్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ నిరాకరించింది. క్యారేజ్ కండిషన్స్ కు లోబడి కస్టమర్లంతా తప్పనిసరిగా తగిన దుస్తులు ధరించాలి. మా విమానాల్లో  అభ్యంతరకరమైన దుస్తులు అనుమతించం. కస్టమర్‌కు మా పాలసీ గురించి సలహా ఇచ్చాం. మరో విమానంలో టికెట్ రీబుక్ చేశాం.. దాంతో ఆమె మయామికి వచ్చారు.’’ అని తెలిపారు.

గత జనవరిలో కూడా ఇట్లాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక యువతి తన దుస్తులను “ఒళ్లంతా చూపించేలా” ఉండడంతో ఆస్ట్రేలియా విమానంలోకి అనుమతించలేదు. క్యాథరీన్ బామ్‌ఫోర్డ్ అనే గాల్ అడిలైడ్ నుండి గోల్డ్ కోస్ట్ కి వెళ్తోంది. ఫ్లైట్‌ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు టైలర్డ్ ప్యాంటు, హై నెక్డ్ క్రాప్ టాప్ , వైట్ ట్రైనర్‌లను ధరించింది. అయితే ఫ్లైట్ ఎక్కే ముందు మహిళా సిబ్బంది తనను సంప్రదించారని, అది తనకు చాలా అవమానంగా అనిపించిందని ఆ 23 ఏళ్ల యువతి చెప్పింది.  అయితే బోర్డింగ్‌కు ముందు కేథరీన్‌ను వేరే టాప్‌లోకి మారాలని కోరినట్లు విమాన సిబ్బంది తెలిపారు. దీంతో ఆమె అవమానకరంగా ఫీలైంది. “మా విమానంలోని దుస్తుల మార్గదర్శకాలు ఆస్ట్రేలియాలోని ఇతర ఎయిర్‌లైన్స్ మాదిరిగానే ఉన్నాయి. మాతో ప్రయాణించే వారిలో ఎక్కువ మంది వాటిని పాటిస్తారు. ఆస్ట్రేలియా యొక్క అత్యంత ఇష్టపడే ఎయిర్‌లైన్‌గా, వర్జిన్ ఆస్ట్రేలియా పేరుగాంచింది.  మేము ఇట్లాంటి ఘటనలపై సమీక్షిస్తున్నాం. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందనప్పటికీ ప్యాసెంజర్స్ కి ఏం జరిగిందో అర్థం చేసుకోగలం.” అని వర్జిన్ ఆస్ట్రేలియా ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement