Sunday, May 5, 2024

పాక్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.272.. ఐఎంఎఫ్‌ షరతులతో పెంపు

ఐఎంఎఫ్‌ షరతులకు తలొగ్గిన పాకిస్థాన్‌ రుణం కోసం ప్రజలపై భారీగా వడ్డనలకు సిద్ధమైంది. ప్రతి పాదించిన మినీ బడ్జెట్‌లో ప్రజలపై భారీగా పన్నులు వడ్దించింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే పెట్రోల్‌ ధరలను కూడా గణనీయంగా పెంచింది. దీంతో పాకిస్థాన్‌లో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టానిక చేరాయి. ఐఎంఎఫ్‌ రుణ ప్యాకేజీలో తొలివిడదత విడుదల చేయించుకోవడానికి, షరతులకు అనుగుణంగా పాకిస్థాన్‌ ప్రజలపై భారీగా భారం మోపింది. ధరలు పెంచడంతో పాకిస్థాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధరను ఆ దేశ కరెన్సీలో 22.20 రూపాయలు పెంచడంతో 272కి చేరింది. హైస్పీడ్‌ డీజిల్‌పై లీటర్‌కు 17.80 రూపాయలు పెంచడంతో 280 రూపాయలకు చేరింది. లైట్‌ డీజిల్‌ ధరను 9.68 రూపాయలు పెంచడంతో లీటర్‌ 196.68కి చేరింది.

- Advertisement -

కిరోసిన్‌ ధర లీటర్‌పై 12.90 పెంచడంతో అది 202.73 రూపాయలు అయ్యింది. పెంచిన ధరలను గురువారం రాత్రి నుంచే అమల్లోకి తీసుకు వచ్చారు. బెయిలవుట్‌ ప్యాకేజీలో రుణసాయాన్ని అందించాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాలని ఐఎంఎఫ్‌ షరతు విధించింది. దీనికి అనుగుణంగా పాక్‌ ప్రభుత్వం వీటి ధరలను భారీగా పెంచింది. ఇప్పటికే రికార్డ్‌ు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడంతో ఇది మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. 2023 ప్రథామార్ధంలో పాక్‌ ద్రవ్యోల్బణం సగటున 33 శాతానిఇ చేరే అవకాశం ఉందని మూడీస్‌ అనలిటిక్స్‌ సీనియర్‌ ఆర్ధికవేత్త కత్రినా ఎల్‌ అంచనా వేశారు.

ఐఎంఎఫ్‌ బెయిలవుంట్‌ ప్యాకేజీ ఒక్కటే పాకిస్థాన్‌ను ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించలేదని స్పష్టం చేశారు. బడ్జెట్‌ లోటు తగ్గించుకుని నికర పన్నుల వసూళ్లు పెంచుకోవడమే లక్ష్యంగా మినీ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జనరల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ను 17 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. దీని ద్వారా అదనంగా 115 బిలియన్‌ రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌లో కొంత కాలంగా తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొంది. ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయింది. దీంతో సామాన్యులు తీవ్రమైన ఇబ ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement