Sunday, April 28, 2024

కె – కారణ జన్ముడు, సి – చిరస్మరణీయుడు , అర్ – రాత మార్చిన మహనీయుడు

సిద్దిపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ సీజన్‌-3ని జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ స్టేడియంలో సినీ నటుడు నాటి, క్రికెటర్‌ అంబటి రాయుడుతో కలిసి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ , కేసీఆర్‌లో.. కే అంటే కారణ జన్ముడని, సీ-చిరస్మరణీయుడు, ఆర్‌ అంటే ఎంతో మంది రాతను మార్చిన మహనీయుడని కొనియాడారు. కానే కాదు, రానే రాదు అన్న తెలంగాణను సాధించి పెట్టారని, రాబోయే రోజుల్లో అద్భుతమైన క్రీడాకారులను తయారు చేసుకుందామన్నారు. దేశంలో మార్పు కోసం మరో లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ బయలుదేరారని, తెలంగాణ తరహా అభివృద్ధి దేశంలో తేవడానికి కేసీఆర్ బయలుదేరారన్నారు. 140 కోట్ల జనాభాలో ఇండియా టీమ్‌లో ఉండేది.. 11 మందే అందులో ఒక్కరు అంబటి రాయుడు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎకరంన్నర భూమిని రాయుడు ఇచ్చాడని, కాళేశ్వరం నీళ్లతో అంబటి రాయుడు బంగారంలాంటి పంట పండిస్తున్నారని హరీశ్‌రావు ప్రశంసించారు. నిత్యజీవితంలో కనబడే పాత్రల నటుడు నాని అని, జెర్సీ సినిమాలో అతను పోషించిన పాత్ర యువతకు ఆదర్శమన్నారు. పట్టుదలతో యువత ముందుకు సాగాలని, నిజజీవితంలో ఆటలు, చదువులు, సామాజిక సేవలో ఆల్‌ రౌండర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

హీరో నాని మాట్లాడుతూ సక్సెస్ సెలబ్రేషన్‌కు వచ్చిన ఆనందం కలుగుతుందన్నారు. దసరా ప్రి ఈవెంట్‌కు వచ్చినట్లు లేదన్నారు. 378 టీమ్‌లు ఆడటం గ్రేట్‌ అని, ఇంత పెద్ద ఈవెంట్ బహుశ దేశంలోనే జరుగలేదన్నారు.

అంబటి రాయుడు మాట్లాడుతూ గత పదేళ్లలో సిద్ధిపేట చూసిన అభివృద్ధి మరెక్కడా చూడలేదన్నారు. తెలుగు వారు మరింతమంది జాతీయ క్రికెట్ ఆడాలని, మంచి కోచ్‌లను ఏర్పాటు చేస్తేమరింత మంది క్రికెట్‌లోకి వస్తారన్నారు.జాతీయ స్థాయిలో ఆడతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement