Friday, April 26, 2024

నేల‌వాలిన భారీ వృక్షం.. క్షణాల్లో స్పందించి, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు

హనుమకొండ జిల్లాలో ఓ భారీ చెట్టు నేల‌వాలింది. కమలాపూర్ మండలం వంగపల్లి పరిధిలోని ప్రధాన రహదారిపై ఈ ఘ‌ట‌న ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి జ‌రిగింది. ఇల్లంతకుంట కమలాపూర్ రహదారిపై ఓ భారీ వృక్షం విరిగిపడింది. ఈ ఘటనలో చెట్టు కింద కమలాపూర్ గ్రామానికి చెందిన శనిగరపు జనార్ధన్ ఇరుక్కుపోయిన‌ట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, ఆ చెట్టు కింద ఇరుక్కపోయిన వికలాంగుడు జ‌నార్ధ‌న్‌ బయటకు రాలేని ప‌రిస్థితి ఉంది. దీంతో కొంచెం క‌ష్ట‌మైనా స‌రే అతడిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వృక్షాన్ని రోడ్డుపై నుండి తొలగించారు. ఈ క్ర‌మంలో పెను ప్రమాదం తప్పింద‌ని ప్రజలు, వాహ‌న‌దారులు ఊపిరి పీల్చుకున్నారు. క్షణాల్లో స్పందించిన పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement