Saturday, April 20, 2024

Marriage Lady: భ‌లే కిలాడీ.. ఆరుగురితో అయిపోయింది, ఏడో వ్య‌క్తితో పెళ్లికి రెడీ!

ఇప్పటిదాకా నిత్య పెళ్లికొడుకు, ఇంత మందిని, అంత మందిని పెళ్లి చేసుకున్నాడు.. మోసం చేశాడు… అన్న వార్త‌లు చ‌దివాం.. టీవీల్లో చూశాం.. కానీ, ఇది మాత్రం చాలా డిఫ‌రెంట్‌.. ఎందుకంటే ఈమె నిత్య పెళ్లికూతురు కాబ‌ట్టి. ఈ వార్త ఇప్పుడు అంతటా హాట్ హాట్‌గా మారింది. ఇప్ప‌టికే ఆ మ‌హిళ ఆరుగురిని పెళ్లి చేసుకుని వారి ద‌గ్గ‌ర నుంచి న‌గ‌దు, న‌గ‌లతో ఉడాయించింది. ఇప్పుడు లేటెస్టుగా ఏడో వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతుండ‌గా అడ్డంగా బుక్క‌య్యింది.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నిత్య పెళ్లికూతురు ఇవ్వాల (శుక్ర‌వారం) అరెస్టు అయ్యింది. ఇప్ప‌టికే ఆ మ‌హిళ ఆరుగురిని పెళ్లి చేసుకుని న‌గ‌దు, న‌గ‌ల‌తో ప‌రారైన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తెలిసింది. ఇక‌.. ఏడో పెళ్లికి కూడా సేమ్ స్కెచ్ వేసి ల‌గ్గం చేసుకోబోతుండ‌గా పోలీసులు సీన్‌లోకి ఎంట‌ర‌య్యారు. అమ్మ‌డి బాగోతాన్ని అక్క‌డున్న వారికి వివ‌రంగా తెలియ‌జేసి క‌టక‌టాల్లోకి నెట్టారు. అయితే.. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు వ‌రుడు ధ‌న్‌పాల్ తెలిపిన‌ట్టు స‌మాచారం. దీంతో సంధ్య అనే స‌ద‌రు నిత్య పెళ్లి కూతురును తిరుచెంగోడులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈమెతో ట‌చ్‌లో ఉన్న గ్యాంగ్ మెంబ‌ర్స్ మ‌రో న‌లుగురిని కూడా నామ‌క్క‌ల్ పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement