Sunday, May 5, 2024

జూన్ 2నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో- 9అవ‌ర్స్ వెబ్ సిరీస్

ఈ మ‌ధ్య కాలంలో ఓటీటీల హ‌వా కొన‌సాగుతోంది. క‌రోనా స‌మ‌యంలో వినోదాన్ని అందించ‌డంలో ముందు వ‌ర‌స‌లో నిలిచాయి ఓటీటీలు. దాంతో వెబ్ సిరీస్ లు కూడా భారీగా తెరకెక్కాయి. కాగా లేటెస్ట్ గా డైరెక్టర్ క్రిష్ ఒక స్టోరీని వెబ్ సిరీస్ గా తీశారు. ఒక సస్పెన్స్ డ్రామాను ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.ఇప్పుడది ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఒక న్యూ కంటెంట్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఆ మూవీ పేరే 9 అవర్స్ . ఈ వెబ్ సిరీస్ జూన్ 2 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుశాలిని, రవి వర్మ, ప్రీతీ అస్రాని వంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement