Tuesday, May 14, 2024

Mumbai: ఆసుపత్రి లిఫ్ట్ కూలి 9 మంది డాక్టర్లకు గాయాలు

ఆసుపత్రిలోని లిఫ్ట్‌ కూలి.. అందులోని 9 మంది వైద్యులు గాయప‌డిన ఘ‌ట‌న మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. న్యూ పన్వెల్ నగరంలోని అమ్లే హాస్పిటల్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రి మూడో ఫ్లోర్‌లో కొందరు వైద్యులు భోజనం చేశారు. అనంతరం వారంతా గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చేరేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. అయితే అది రెండో ఫ్లోర్‌కు చేరగా లిఫ్ట్‌ మెటల్‌ రోప్‌ తెగిపోయింది. దీంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి వేగంగా పడిపోయింది. లిఫ్ట్‌ కూలిన సంఘటన గురించి తెలిసిన వెంటనే ఫైర్‌ సిబ్బంది ఆ ప్రైవేట్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న డాక్టర్లను కాపాడారు. తీవ్రంగా గాయపడిన 9 మంది వైద్యులను చికిత్స కోసం మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement