Thursday, May 16, 2024

తెలంగాణ నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు

తెలంగాణ నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు మంజూరయ్యాయి. నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు కేటాయించింది. 532 వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 109 ఎలక్ట్రీషియన్‌ సహా ఇతర పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

భారీ మధ్య తరహా, చిన్ననీటి పారుదల శాఖలు, తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తూ చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ఇటీవల మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వివిధ శాఖల కింద ఉన్న విభాగాలు.. ఆరు ఇంజినీర్‌ చీఫ్‌ స్థానాలు, 19 ప్రాదేశిక జలవనరుల ప్రాంతాల కిందకు వచ్చాయి.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ గూటికి టి.టీడీపీ అధ్యక్షుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement