Thursday, May 16, 2024

జులైలో జ‌ర‌గ‌నున్న‌ 6 ప్రవేశ పరీక్షలు….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2022-23 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీఈటీ) షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, అందులో ఆరింటికి జూలై నెలలోనే ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మిగతా ఒకటి ఆగస్టులో జరగనుంది. టీఎస్‌ ఎంసెట్‌-జూలై 14 నుంచి 20 వరకు జరగనుంది. ఈసెట్‌-జూలై 13, ఐసెట్‌-జూలై 27, 28న, పీజీఈసెట్‌-జూలై 29 నుంచి ఆగస్టు1న. లాసెట్‌-జూలై 21, 22న, ఎడ్‌సెట్‌-జూలై 26, 27న, పీఈసెట్‌ ఆగస్టు 22న జరగనుంది. అయితే ఈ ప్రవేశ పరీక్ష లకు అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు అందుతు న్నాయి. ఇంకా దరఖాస్తు గడువు ఉండడంతో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

జూన్‌ 21 నుంచి డిగ్రీ పరీక్షలు…

జూన్‌ 21 నుంచి జూలై 9వరకు డిగ్రీ పరీక్షలు జరగనున్నా యి. ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు పూర్తియ్యాయి. డిగ్రీ పరీక్షలు, పీజీ, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు ప్రారం భం కానున్నాయి. మొదటి ప్రవేశ పరీక్ష జూలై 13న ఈసెట్‌ జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement