Saturday, April 27, 2024

వెనుకబడిన వర్గాలకు 50శాతం రిజర్వేషన్లు, బీసీ బిల్లు ఆమోదానికి విజ్ఞప్తులు.. రేపు ఢిల్లీలో మహాధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు వెనుకబడిన వర్గాలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపడుతున్న బీసీల మహాధర్నాకు అన్ని రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున బీసీలు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ బిల్లు ఆవశ్యకతను తెలియజెబుతూ ఇప్పటికే పలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించామని చెప్పారు.

ఈ మహాధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొంటారని తెలిపారు. బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న కేంద్రంతో ఎంత వరకైనా పోరాడతామని అన్నారు. బీసీల తలరాతలను మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేంత వరకు అన్ని పార్టీల బీసీ ఎంపీలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. ఈనెల 30న బీసీ ఎంపీలతో సమావేశం, 31న పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నామని దాసు సురేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement