Friday, April 26, 2024

4th test: రన్ మెషిన్ రికార్డులు..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మరికొన్ని రికార్డులను తన ఖాతలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా ఉన్నా…కోహ్లీ మాత్రం తన వ్యక్తిగత రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో 50 పరుగులు మాత్రమే చేసి ఔటైన కోహ్లీ ఓవరల్ గా అంతర్జాతీయ క్రికెట్‌లో… 23వేల పరుగులు చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్‌, టీమిండియా వాల్‌ రాహుల్ ద్రవిడ్‌… వన్డేలు, టెస్టుల్లో కలిపి 23వేల పరుగుల మార్క్‌ను దాటారు. తాజాగా ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ చేరాడు. 490 ఇన్నింగ్స్‌ల్లోనే 23వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. 34,357 పరుగులతో టెండూల్కర్‌ తొలిస్థానంలో ఉండగా… 24,208 రన్స్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక విదేశాల్లో… ఒకే దేశంలో 10 అంతకంటే ఎక్కువ టెస్టులకు సారథ్యం వహించి తొలి ఇండియన్ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు కోహ్లీ… ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగానే ఈ రికార్డు కోహ్లీ సొంతమైంది. ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఇది పదో టెస్టు. ఆ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇంగ్లండ్‌లో 9 టెస్టులకు సారథ్యం వహించి రెండో స్థానంలో ఉండగా, సునీల్ గవాస్కర్ పాకిస్థాన్‌లో 8 టెస్టులకు సారథ్యం వహించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో నాలుగో స్థానం కూడా కోహ్లీదే.

ఇది కూడా చదవండి: అరుదైన ఘటన: కవల పిల్లలకు జన్మినిచ్చిన ఏనుగు!

Advertisement

తాజా వార్తలు

Advertisement