Saturday, April 27, 2024

352 ఎంఓయూలు.. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు..

ఏపీ గ్లోబ‌ల్ లో ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సులో సునామీలా పెట్టుబ‌డులు వెల్లువెత్తాయి. సుమారుగా 13 ల‌క్ష‌ల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు ఏపీ ప్ర‌భుత్వంతో అంగీకారం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేం చూపిన ధృఢమైన నిబద్ధత కారణంగా, సానుకూల వ్యాపార పరిస్థితులు కారణంగా ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఎనర్జీ రంగంలోనే రూ.8.84 లక్షల పెట్టుబడులు…
ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాం. 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి.

ఐటీ రంగంలో…
ఐటీ, ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నాం. వీటి విలువ రూ.25,587 కోట్లు. 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయి.

టూరిజం రంగంలో ..
టూరిజంకు 117 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయి.

సదస్సు వేదికగా రూ.3841 కోట్ల విలువైన 14 యూనిట్లు ప్రారంభం…
ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయ‌న్నారు. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్‌ ల్యాబ్, హేవెల్స్‌ఇండియా, శారదా మెటల్స్‌ మరియు అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణం అన్నారు.

- Advertisement -

రెన్యువబుల్‌ ఎనర్జీ– గణనీయంగా పెట్టుబడులు..
గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్‌ఎనర్జీని నేను గట్టిగా చెప్ప‌గ‌ల‌ను అని సీఎం జ‌గ‌న్ అన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్‌ స్టో్టరేజీ మరియు గ్రీన్‌ హైడ్రోజన్‌ మరియు గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయ‌ని, శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయ‌న్నారు. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్‌ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్‌కు తన లక్ష్య సాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement