Friday, April 26, 2024

పార్లమెంట్​లో 24 బిల్లులు సిద్ధం.. తెలంగాణ గిరిజన యూనివర్సిటీకి ఆమోదం దక్కేనా?

ఈసారి జరిగే పార్ల మేంటు సమావేశాల్లో 24 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నది. వీటిలొ కంటొన్మేంటు బిల్లు, మల్టి స్టేట్‌ కొఆపరేటివ్‌ సొసైటీసే సవరణ బిల్లు, దివాళా చట్టం సవరణ బిల్లు తదితర వంటివి ఉన్నాయి. ఇక.. పార్లమెంటు సమావేశాలు సొమవారం నుంచి ప్రారంభం కానుండగా.. గత సమావేశాల్లొ చర్చించిన బిల్లులకు ఈసారి అనుమతి లభించనున్నట్టు తెలుస్తోంది. సహకార సంఘాలను పటిష్టం చేయడానికి ఈ బిల్లులో పలు అంశాలను చేర్చారు.

అలాగే, పట్టణాభివృద్ధి సంస్థలను వృద్ధి చేయడం కొసం కంటోన్మేంట్‌ బిల్లులొ పలు అంశాలను చేర్చారు. పార్లమేంటులో ధర్నాలు, బైఠాయింపులను నిషేధించనున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఒకటైన గిరిజన యూనివర్సిటీకి కూడా ఈ సెషన్​లో ఆమోదం దక్కనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement