Saturday, June 3, 2023

ఆర్ ఆర్ ఆర్ మూవీతో నా బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ – ట్వీట్ చేసిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు

హాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత స్కాట్ డెర్రిక్ స‌న్ త‌న పుట్టిన‌రోజు వేడుక‌ను ఇంట్లోనే చేసుకున్నారు..తన భార్య, పిల్లలతో కలిసి ఆర్ఆర్ఆర్’ మూవీని చూశానని తెలిపారు. సినిమాలో తనకు నచ్చిన యాక్షన్ సీక్వెన్స్ వీడియో క్లిప్ ను పంచుకున్నారు.
సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలలకూ ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. పైగా వరుస ప్రశంసలు దక్కడం తెలుగు సినిమాకే గర్వకారణమని చెప్పాలి. ఇక ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రపంప వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గో ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది. మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరన్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement