Tuesday, May 7, 2024

రేపటి నుంచి టీఎస్​ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు.. మూడు రోజులు నిర్వహణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్‌ ఎంసెట్‌- 2022) ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ఈ నెల 18, 19, 20 తేదీల్లో యథాతథంగా జరగనున్నాయి. మొత్తం 1, 72, 241 మంది విద్యార్తులు పరీక్షలు రాయనున్నారు. ఎంసెట్‌- 2022ను తెలంగాణలోని 89 కేంద్రాల్లో, ఏపీలోని 19 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహించే పరీక్షలకు… విడతకు 29వేల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిం చనున్నారు.

ఉదయం పూట నిర్వహించే పరీక్షలు 9గంటల నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం పరీక్ష ను 3 గంటలకు ప్రారంభించి 6 గంటల వరకు నిర్వహించ నున్నా రు. ఇందులో ఈ మేరకు టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ సూచించారు. హాల్‌ టికెట్లో సూచించిన నిబంధనలను పరీక్షా సమంయంలో విద్యార్థులు కచ్చితంగా పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష తేదీలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌ పరీక్షను జేఎన్‌టీయూ , హైద రాబాద్‌ నిర్వహిస్తోంది.

టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేవాలు పొందేందుకు విద్యార్థులు ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోలజీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతను సాధించాలి. కాగా.. భారీ వర్షాల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాసిన ఎంసట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా విద్యా సంస్థలకు వారం రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే వర్షాలు తెరిపినివ్వడంతో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షను ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ మేరకే నిర్వహిస్తున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement