Sunday, May 19, 2024

కాంగో న‌ర‌మేథం – ఉగ్ర‌దాడిలో 20 మంది హ‌తం

ఆఫ్రికా దేశః కాంగోలో ఉగ్రవాదులు మ‌రో్సారి న‌ర‌మేథానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్స్ ఉగ్రసంస్థ బాధ్యతవహిస్తూ ప్రకటనచేసింది. బెనీ టెర్రిటరీలోని ముసందబాలో 20 మృతదేహాలను గుర్తించామని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు… కాగా, ఉగాండాకు చెందిన అల్లైండ్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్ గ్రూప్‌ స్థానికులపై దాడులకు పాల్పడిందని ఆర్మీ అధికారులు ఆరోపించారు. కాగా, ఈ ఏడాది మార్చి 20న కూడా తూర్పు ఇటూరి, ఉత్తర కివు ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు రెండు వేర్వేరు దాడుల్లో 22 మందిని హతమార్చడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను ఎత్తుకెళ్లారు. ఇటూరి ప్రావిన్స్‌లోని పలుగ్రామాలపై దాడులకు పాల్పడి 12 మందిని ఊచకోతకోశారు. అదేవిధంగా కివు ప్రావిన్స్‌లో 10 మందిని చంపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement