Sunday, May 19, 2024

Gold Rate Today: నేటి బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా..!

హైదరాబాద్ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు 22 క్యారెట్ల ధర ఇవాళ స్థిరంగా ఉంది. ఇటీవల గరిష్ఠాలను తాకిన పసిడి క్రితం రెండు సెషన్లలో కాస్త దిగివచ్చింది. ప్రస్తుతం తులం బంగారం రూ.55 వేల 800 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు చూసుకున్నట్లయితే 10 గ్రాములకు రూ.60 వేల 870 పలుకుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55 వేల 950 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ప్రస్తుతం రూ.61 వేల 020 పలుకుతోంది. వెండి రేట్ల విషయానికి వస్తే బంగారంతో సమానంగా పోటీ పడుతూ పరుగులు పెడుతోంది. వరుసగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధర ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదారాబాద్‌లో కిలో వెండి రేటు రూ.80 వేల 200 పలుకుతోంది. ఇక దేశ రాజధాని హస్తినాలో చూసుకున్నట్లయితే కిలో వెండి ధర రూ.76 వేల 600 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీతో పోలిస్తే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా వెండి రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సులు కారణమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement