Tuesday, May 14, 2024

జ‌న‌సేన – వైసిపి స్టిక్క‌ర్ వార్ – ఫ్యాన్ కు గ్లాస్ కు మ‌ధ్య‌ ర‌గ‌డ‌

తిరుప‌తి -ముఖ్యమంత్రి జగన్ పాలన, సంక్షేమ పథకాల అమలు తీరును జనంలోకి తీసుకెళుతున్న వైసీపీ ఇంటింటికీ వెళ్లి ”మా నమ్మకం నువ్వే జగన్ ” నినాదంతో కూడిన స్టిక్కర్లను అంటిస్తోంది. సీఎం జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అమల్లోకి వచ్చిన పథకాలను, అభివృద్ధిని జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. తిరుప‌తిలో వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేన ఇప్పుడిదే అంశంలో పోటీ కార్యక్రమం చేపట్టింది. వైసీపీ నాయకులనే ఫాలో అవుతున్న జనసేన నాయకులు వాళ్లు స్టిక్కర్లు వేసిన చోట జనసేన స్టిక్కర్లను అంటిస్తున్నారు. మాకు నమ్మకం లేదు జగన్, మా నమ్మకం పవన్ అనే నినాదాలతో ఉన్న స్టిక్కర్లను ప్రతీ ఇంటి గోడకు అతికిస్తున్నారు.


ఇప్పుడీ రెండు పార్టీల తీరు.. తిరుపతిలో రాజకీయంగా దుమారం రేపుతోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందని వైసీపీ చెబుతుంటే, నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చలేదంటూ జనసేన గ‌ళ‌మెత్తుతున్న‌ది.. జగన్ పై నమ్మకం ఉందా అంటూ.. కనిపించినవారినల్లా జ‌న‌సేన ప్రశ్నిస్తోంది.ఇది ఇలా ఉంటే , జగన్‌పై నమ్మకం లేదంటూ స్టిక్కర్లు వేస్తుంటే పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు. వాళ్లు అంటిస్తుంటే అడ్డుకోని పోలీసులు త‌మ‌ను బెదిరిండం ఏమిటంటూ పోలీస్ తీరును ఎండ‌గ‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement