Monday, October 18, 2021

తెలుగు అకాడమీ నిధులు గోల్ మాల్.. ఇద్దరు అరెస్ట్

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూనియన్ బ్యాంక్‌ సంతోష్ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, అగ్రసేన్ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు అకాడమీ నిధుల మాయం అంశం సంచలనంగా మారింది. యూనియన్‌ బ్యాంకు, కెనరా బ్యాంకులోని డిపాజిట్లు మాయమైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కార్వాన్‌ యూనియన్‌ బ్యాంకు శాఖలో గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జూలై వరకూ పలు విడతలుగా రూ.43 కోట్లు గల్లంతైయ్యాయి. ఇప్పుడు ఇదే బ్యాంకుకు చెందిన సంతోష్ నగర్ బ్రాంచ్‌లో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా జూలై, ఆగస్టు నెలల్లో మాయం అయ్యాయి. కెనరా బ్యాంకు నుంచి మరో రూ.9 కోట్లను కూడా దారి మళ్లించి కాజేశారు. దీంతో బ్యాంకు సిబ్బంది పాత్రపై అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం  రూ.64 కోట్లు దారిమళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది వరకు యాంటీబాడీలు: ICMR..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News