Saturday, April 20, 2024

అన్నమయ్య సంకార్తనలు

రాగం – గంభీరనాట
తాళం – త్రిస్రఏక – ఆది

ప|| తిరొ తిరొ జవరాల తిత్తితిత్తి ఈ
తరలమైన నీ తారహార మదురే || తిరొ ||

చ|| ధిమి ధిమి తొంగ తొంగ దిద్కిమిక్కి ఆరే
మమారే పాత్రారావు మజ్జా మజ్జా
కమలనాభుని తమ కపుటింతి నీకు
అమరె తీరపు ఇదె అవధరించగదా || తిరొ ||

చ|| ఝక్క జక్క ఝం ఝం ఝణకిణాని
ప్రకటపు మురువొప్పె భళాభళా
సకల పతికి సరసపు కొమ్మా నీ
మొకసిరి మెరెసె చిమ్ముల మురిపెముల || తిరొ ||

చ|| మాయి మాయి అలమేలు మంగ నాంచారి మతి
బాయని వేంకటపతి పట్టపురాణి
మ్రోయ చిరుగజ్జెలా నీ మ్రోతలానేని
సోయగమైన నీ సొలుపు చూపమరే || తిరొ ||

- Advertisement -

అన్నమాచార్యుల వారు నాట్యగురుస్థానంలో ఉండి అలమేల్మంగ చేత నాట్యం చేయిస్తున్న పాట యిది. అమ్మవారే శుభమై తానున్నది. ఆమె మెడలోని తార హారము శోభగలది. ఆమె నడుము సొగసైనది. అనగా మిగిలిన శరీరాంగాలతో పొంతన గలది. తాళ బ ద్ధంగా నాట్యం చేస్తూనే పాత్రలో లీనం కావటం మరవకుమమ్మా. ఆమె చేతికి బంగారు కడియము ఒప్పుచున్నది. సర్వమునకు ప్రభువు అయిన స్వామికి ఆనందమును గూర్చుసతి ఈమె. నీ ముఖసిరి కాంతులు, చిరుగజ్జెల మ్రోతలలో సొగసు ప్రకటింపబడుచున్నవి. అమ్మవారి చరణాలు ఆశ్రయించి, ఆమె కరుణ పొందినవాడే స్వామి సన్నిధికి చేరగలడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement