Monday, May 20, 2024

సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగుపాటు 11 మంది మృతి..

 సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడి 11 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. జైపూర్ లోని అమేర్ ప్యాలెస్ వ‌ద్ద ఉన్న వాచ్ ట‌వ‌ర్‌కు నిన్న ప‌ర్యాట‌కులు పోటెత్తారు. ఆదివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో వాచ్ ట‌వ‌ర్ వ‌ద్ద భారీ వ‌ర్షం కురిసింది. ఈ క్ర‌మంలో ఆ ట‌వ‌ర్ వ‌ద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప‌ర్యాట‌కులు ఎగ‌బ‌డ్డారు. ఆ స‌మ‌యంలోనే భారీ పిడుగు ప‌డింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే 11 మంది ప‌ర్యాట‌కులు మృతి చెంద‌గా, మ‌రో 35 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులు ప‌క్క‌నున్న లోయ‌లో ప‌డిపోయారు. వారంద‌రినీ రెస్క్యూ టీం బ‌య‌ట‌కు తీసుకొచ్చి.. స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు.

ఇది కూడా చదవండి: జనాభా తగ్గించేందుకు కొత్త విధానం

Advertisement

తాజా వార్తలు

Advertisement