Tuesday, June 11, 2024

హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ దేవతకు రెండున్నర కిలోల బంగారు చీర

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేటలోని ఎల్లమ్మ దేవతకు భక్తులు రెండున్నర కిలోల బంగారు చీరను సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా ఈ చీరను ఈ రోజు దేవతకు సమర్పించారు. దాతలు కూల వెంకటేశ్ గౌడ్ తదితరులు చీరను తయారు చేయించారు. రాష్ట్రానికి ఎంతో  మేలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ లో దేశానికి కూడా సేవ చేయాలని కోరుకుంటూ… ఆయన జన్మదినం సందర్భంగా ఈ చీరను అమ్మవారికి సమర్పిస్తున్నట్లు దాతలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement