Monday, June 24, 2024

HYD: సరికొత్త జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించిన క్షేమ జనరల్ ఇన్సూరెన్స్

హైద‌రాబాద్ : ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా పంటల బీమాపై అవగాహన పెంచే లక్ష్యంతో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ తమ జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సమగ్ర ప్రచారంలో ప్రధాన అంశం టీవీ ప్రచారం, ఇది రుతుపవనాల ప్రారంభంతో రైతులు విత్తడం ప్రారంభించిన వేళ వారికి చేరుతుంది. ప్రింట్, డిజిటల్, అవుట్‌డోర్ మీడియాలో ఏకకాలంలో చేసే ప్రచారం ద్వారా ఈ టీవీ ప్రచారం మరింతగా రైతులకు చేరుతుంది.

ఈసంద‌ర్భంగా క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ భాస్కర్ ఠాకూర్ మాట్లాడుతూ… పంట బీమా సహాయంతో, పంట నష్టాన్ని తగ్గించడం, దాని ఫలితంగా వచ్చే ఆదాయ నష్టాల గురించి అవగాహన కల్పించడానికి తాము తండ్రీ-కూతుళ్ల బంధం అద్భుతమైన చిత్రాలపై ఆధారపడ్డందుకు తాను సంతోషిస్తున్నానన్నారు. రైతులను ఆదాయ నష్టాల నుండి రక్షించడం, ఆర్థిక స్థిరత్వంను పెంపొందించడం ప్రాముఖ్యతను తెలియజేయడానికి తాము తండ్రి, కుమార్తెల మధ్య సంభాషణ భావోద్వేగ లోతును ఎంచుకున్నామన్నారు.

పిల్లలు అమాయకత్వంతోనే అయినా చాలా పదునైన ప్రశ్నలను అడగవచ్చు, అవి పెద్దలను ఆలోచించేలా చేస్తాయన్నారు. విపత్తుల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి పంట బీమాను కొనుగోలు చేయాలనే త‌మ సందేశాన్ని అందించడానికి తాము ఆ అమాయకత్వాన్ని ఎంచుకున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement