Thursday, July 25, 2024

Odisha సీఎంగా మోహన్ చరణ్ మాఝీ… రేపే ప్రమాణస్వీకారం

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒడిశా సీఎంగా చరణ్ మాఝీ రేపు (బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఒడిశాలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రానుండ‌గా… ఒడిశాలో తొలి బీజేపీ సీఎంగా చరణ్ మాఝీ నిలవనున్నారు.

ఇక‌ ఒడిశా డిప్యూటీ సీఎంలుగా బీజేపీ అధిష్టానం ఇద్దర్ని నియ‌మిస్తు నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నిర్ణ‌యం మేర‌కు కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవాతి పరిదా డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం మోహన్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలు, మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకుగానూ బీజేపీ 78 స్థానాల్లో గెలుపొంది రాష్ట్ర చరిత్రలో తొలిసారి అధికారం చేపడుతోంది. బిజు జనతా దళ్ (BJD) పార్టీకి 51 సీట్లు రాగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో, సీపీఐఎం ఒక్క సీటు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. 25 ఏళ్లుగా నవీన్ పట్నాయక్‌ ఒడిశా రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. కానీ బీజేడీ కంచుకోటను బీజేపీ బద్ధలుకొట్టి, నవీన్ పట్నాయక్‌ను అధికారానికి దూరం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement